ఎవరూ, ఎన్నడూ చేయని విధంగా శాతకర్ణి ఆడియో వేడుక !

Gautamiputra-Satakarni
నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100వ ప్రాజెక్ట్ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆడియో విడుదల కార్యక్రమం ఈ రోజు సోమవారం తిరుపతిలోని పండిట్ జవహర్ లాల్ నెహ్రు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున, నందమూరి అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేని విధంగా నిర్వహించాలని చిత్ర నిర్మాతలు సంకల్పించారట. అందుకోసమే అన్ని ఏర్పాట్లు చాలా ప్రత్యేకంగా చేస్తున్నారు.

ఇంతకు ముందే ఎవరూ చేయని విధంగా ప్రతి ఒక్కరికి డిజిటల్ ఇన్విటేషన్లు పంపి అందరి దృష్టినీ ఆకర్షించిన టీమ్ వేడుక జరగబోయే గ్రౌండ్స్ లో 100 అడుగుల ఎత్తున్న ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయనున్నారట. అలాగే భారీగా తరలి వచ్చే అభిమానులకు, అతిధులకు ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా ఉండేలా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారట. ఈ ఏర్పాట్లతో ఇంతకు మునుపు ఎవరూ చేయని విధంగా న భూతో అనే రీతిలో ఈ వేడుక నిలుస్తుందని అంటున్నారు. శాతవాహన వంశపు రాజు గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్, రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు.