అంగరంగ వైభవంగా ‘శతమానం భవతి’ ఆడియో !

18th, December 2016 - 10:04:50 AM

shatamanam-bhavati-audio
‘ఎక్స్ ప్రెస్ రాజా’ వంటి కమర్షియల్ సక్సెస్ తరువాత యంగ్ హీరో శర్వానంద్ చేస్తున్న కుటుంబ కథా చిత్రం ‘శతమానం భవతి’. వేగేశ్న సతీష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం ‘బొమ్మరిల్లు’ తరహాలో తనకు గొప్ప విజయాన్ని అందిస్తుందని, అందుకే ఇది తనకు ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని దిల్ రాజు మొదటి నుండి ధీమాగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ‘ఖైదీనెం 150, గౌతమీపుత్రశాతకర్ణి’ వంటి పెద్ద సినిమాలతో
పాటు సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.

ఇకపోతే ఈ చిత్రానికి సంబందించిన ఆడియో కార్యక్రమాన్ని నిర్మాత దిల్ రాజు పుట్టినరోజైన ఈరోజు సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే అందుకు సంబందించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. నిన్న రాత్రి ఈ చిత్ర ఆడియో విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాబట్టుకుంటోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జయసుధలు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా శర్వానంద్ సరసన అనుపమ్ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో తాత, మనవళ్ల మధ్య నడిచే సెంటిమెంట్ ప్రధానాంశంగా ఉండనుంది.