భారీ స్థాయిలో ‘డీజే’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ?


టాలీవుడ్లో ట్రెండ్ మారింది. ఇంతకు ముందు సినిమాకి ఆడియో వేడుక ఎంత ముఖ్యమో ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతే ప్రధానంగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ తమ సినిమాలకు విడుదలకు ముందు ఈ వేడుక ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ట్రెండ్ ను మొదలుపెట్టింది అల్లు అర్జునే. ఆయన గత చిత్రం ‘సరైనోడు’ కు మొదటగా ఈ ఈవెంట్ జరిగింది. ఆ పై సినిమా కూడా భారీ సక్సెస్ అయింది. అందుకే బన్నీ తాను తాజాగా నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ కు కూడా ఈ పద్ధతినే ఫాలో అవ్వనున్నాడట.

అందుకోసం వైజాగ్ ను వేదిక చేసుకుని జూన్ 18వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారని వినికిడి. అయితే ఈ అంశంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇకపోతే హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం యొక్క ఆడియో వేడుకను ఈ 11వ తేదీన నిర్వహించి 23వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నారు.