నాగచైతన్య తొలి వెబ్ సిరీస్ ‘దూత’ కి గ్రాండ్ రిలీజ్ ప్లానింగ్స్ ?

Published on May 19, 2023 12:38 am IST

అక్కినేని నాగ చైతన్య లేటెస్ట్ గా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన కస్టడీ మూవీలో నటించారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మిశ్రమ స్పందనతో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. మరోవైపు ఆయన తొలిసారిగా దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. చాలా రోజుల క్రితం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న దూత వెబ్ సిరీస్ తప్పకుండా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని ఇటీవల కస్టడీ ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

హర్రర్ జానర్ లో రూపొందిన దూత వెబ్ సిరీస్ ని ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ దేశవ్యాప్తంగా పలు భాషల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తోందట. ఇందుకోసం ఇప్పటికే వారు పలు భాషల డబ్బింగ్ ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ లో నాగచైతన్య ఒక జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుండగా విక్రమ్ కె కుమార్ దీనిని తెరకెక్కించారు. కాగా అతి త్వరలో ఈ వెబ్ సిరీస్ నుండి అప్ డేట్స్ ఒక్కొక్కటిగా రానుండగా దీనిని జులై లో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

సంబంధిత సమాచారం :