SSMB28 కోసం రెడీ అవుతోన్న భారీ సెట్స్ ?

SSMB28 కోసం రెడీ అవుతోన్న భారీ సెట్స్ ?

Published on Dec 8, 2022 1:02 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబుతో టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న SSMB28 మూవీ ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతాన్ని, అలానే పీఎస్ వినోద్ ఫోటోగ్రఫి ని అందిస్తున్నారు. మొత్తంగా అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ప్రస్తుతం ఈ మూవీ కోసం మొత్తం మూడు భారీ సెట్టింగ్స్ గ్రాండ్ లెవెల్లో సిద్ధం అవుతున్నాయట.

అలానే ఈ మూవీలో ఒక ప్రముఖ సీనియర్ స్టార్ నటి కీలక పాత్ర చేయనున్నారని, అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని కూడా ఆకట్టుకునేలా ఈ మూవీ యొక్క కథ, కథనాల్ని దర్శకుడు త్రివిక్రమ్ అద్భుతంగా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరి దాదాపుగా పుష్కర కాలం విరామం తరువాత సూపర్ స్టార్ మహేష్, సూపర్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీకి సంబదించిన మరిన్ని అప్ డేట్స్ కోసం మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు