వెంకటేష్ సినిమాలో భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ !


‘బాహుబలి’ తర్వాత తెలుగు పరిశ్రమలో సినిమాలు తీసే విధానం, ప్రేక్షకులు సినిమానౌ చూసే విధానం రెండు మారిపోయాయి. నిర్మాతలు తీస్తే విజువల్ ఎఫెక్ట్స్ తో భారీ సినిమాల్ని తీయాలనుకుంటుంటే ఆడియన్స్ చూస్తే బాహుబలి లాంటి సినిమాల్నే చూడాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ బాటలోనే విక్టరీ వెంకటేష్ సినిమాకు బాటలు పడుతున్నాయి. నూతన దర్శకుడు ఒకరు చెప్పిన కథ నచ్చడంతో ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ ఆ సినిమాపై వర్క్ చేస్తోంది.

థ్రిల్లర్ జానర్లో ఉండనున్న ఈ సినిమా యానిమల్ బేస్డ్ మూవీగా ఉంటుందని, అందులో భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ఉంటయాని సురేష్ బాబు ఒక ప్రెస్ మీట్లో అన్నారు. గత నాలుగైదు నెలలుగా ఆ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నామని కానీ సినిమాను ఎలా తీయాలనే పూర్తి క్లారిటీ రాలేదని, అందుకు కారణం తనకు విజువల్ ఎఫెక్ట్స్ మీద పూర్తి అవగాహనలేకపోవడమేనని, ఒకసారి ఐడియా వచ్చాక చేస్తాన్నని, అలాగే వెంకటేష్, రానాలతో కలిపి భారీ సినిమాలే చేస్తానని అన్నారు.