ఢిల్లీ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి గ్రాండ్ వెల్కమ్.!

Published on Mar 17, 2023 3:00 pm IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ తో ఓ సెన్సేషనల్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాకి ముందు చేసిన పాన్ వరల్డ్ హిట్ “రౌద్రం రణం రుధిరం” గ్రాండ్ సక్సెస్ తో మొన్ననే హిస్టారికల్ ఆస్కార్ అవార్డు అనుకున్నాక చిత్ర యూనిట్ ఒకోకరు ఇండియాకి వస్తుండగా అభిమానులు గ్రాండ్ వెల్కమ్ ని అందిస్తున్నారు.

ఇక ఫైనల్ గా అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇండియా లోకి అడుగు పెట్టాడు. మరి ఈ సాయంత్రం అయితే ఇండియా టుడే వారి ఓ ప్రఖ్యాత మీటింగ్ కి గాను చరణ్ హాజరు కావాల్సి ఉండగా తాను మొదటగా ఢిల్లీ లో ఈరోజు ల్యాండ్ అవ్వగా అక్కడ చరణ్ కి భారీ ఆహ్వానం దక్కింది. దీనితో ఇప్పుడు పలు ఫోటోలు మరియు చరణ్ కి ఆహ్వానం అందిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :