షూటింగ్ పూర్తి చేసుకున్న డిఫ‌రెంట్ స్పై థ్రిల్ల‌ర్ ‘గ్రే’..!

షూటింగ్ పూర్తి చేసుకున్న డిఫ‌రెంట్ స్పై థ్రిల్ల‌ర్ ‘గ్రే’..!

Published on Nov 22, 2021 2:45 PM IST


ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతున్న చిత్రం ‘గ్రే’. స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్‌ మ‌దిరాజు ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా, కిర‌ణ్ క‌ల్లాకురి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ‘ద స్పై హూ ల‌వ్డ్ మి’ అనే ట్యాగ్‌లైన్‌తో తెర‌కెక్కుతోన్నఈ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ ల్యాబ్‌లో చిత్ర యూనిట్ గుమ్మ‌డికాయ కొట్టారు. త్వ‌ర‌లోనే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ప్రారంభంకానున్నాయి.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రాజ్ మ‌దిరాజ్ మాట్లాడుతూ ‘అద్వితీయ మూవీస్ ప్రై.లి పై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతున్న ‘గ్రే’ మూవీ షూటింగ్ ఈ రోజు పూర్త‌య్యింది. ఇదొక స్టైలిష్‌ స్పై థ్రిల్లర్ మూవీ. ట్విస్టులు ట‌ర్నుల‌తో ఆధ్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా ఉంటుంది. ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్ అన్ని పాత్ర‌ల‌కి మంచి ప్రాధాన్య‌త ఉంటుంది. 20 రోజుల పాటు నిర్విరామంగా హైద‌రాబాద్‌లోని ప‌లు అంద‌మైన లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ జ‌రిపామని అన్నారు. నిర్మాత కిర‌ణ్‌గారు పూర్తి స‌హ‌కారం అందించారని, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభంకానున్నాయి. ఔట్‌పుట్ ప‌ట్ల మా టీమ్ అంద‌రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. త‌ప్ప‌కుండా ఒక డిఫ‌రెంట్ మూవీ అవుతుంద‌ని న‌మ్ముతున్నానని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు