‘గుచ్చే గులాబీ లాగా’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసిందోచ్..!

Published on Oct 22, 2021 1:48 am IST

అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్”. ఈ సినిమాను మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

అయితే ఈ చిత్రం నుంచి ‘గుచ్చే గులాబీ లాగా ఫుల్ వీడియో సాంగ్ వచ్చింది. 4:59 నిమిషాల పాటు ఉన్న ఈ సాంగ్‌ని గీతా ఆర్ట్స్ విడుదల చేసింది. అయితే ఈ పాటకు అనంత శ్రీఆరాం, శ్రీమణి లిరిక్స్ రాయగా, గోపీ చందర్ మ్యూజిక్ అందించారు.

సంబంధిత సమాచారం :

More