గూఢచారి ఫై ప్రశంసల జల్లు !

guda 123telugu

నూతన దర్శకుడు శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో అడివి శేష్ , శోభిత దూళిపాళ్ల జంటగా నటించిన చిత్రం’ గూఢచారి’. ఈ చిత్ర టీజర్ ఈ రోజు ప్రముఖ హీరోయిన్ సమంత అక్కినేని చేతులమీదకు విడుదలైంది. తాజాగాఈ చిత్ర టీజర్ ను చూసిన ప్రముఖ హీరోలు నాగార్జున , నానిలు అడివి శేష్ ఫై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్ర టీజర్ బాగుందని ఈ చిత్రం తో నీ కళలు నెరవేరుతాయని నాగ్ ట్వీట్ చేశారు . అలాగే టీజర్ సూపర్ గా వుంది ఈ సినిమా చూడడానికి ఎదురుచూస్తున్నానని అని మరో హీరో నాని ట్వీట్ చేశారు .

ఇక చాలా కాలం తరువాత సుప్రియ ఈ సినిమా ద్వారా తెలుగులోకి మళ్ళి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో ఆమె ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు . శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నా ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్పై థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రం ఆగష్టు 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Exit mobile version