పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు మంచి హై లో ఉన్నారు అని చెప్పాలి. ఓ పక్క తన సెన్సేషనల్ ప్రాజెక్ట్ “ఓజి” నుంచి అప్డేట్స్ హైప్ అలాగే ఇంకో పక్క తన వింటేజ్ చిత్రం “గుడుంబా శంకర్” రీ రిలీజ్ హంగామాతో పవన్ బర్త్ డే ని నెక్స్ట్ లెవెల్లో చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉండగా నిన్నటి నుంచే గుడుంబా శంకర్ మేనియా అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది.
హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో సహా పలు సింగిల్ స్క్రీన్స్ లో సినిమా షోస్ తో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్న ఫోటోలు వీడియోలు అయితే ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక మళ్లీ ఈ సెప్టెంబర్ 2 నుంచి మళ్లీ షోస్ పడనున్నాయి. ఆరోజు పవన్ బర్త్ డే కావడంతో అయితే ఇక ఆరోజు మరింత స్థాయిలో రచ్చ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. ఇక ఈ చిత్రానికి వీర శంకర్ దర్శకత్వం వహించగా పవన్ స్క్రీన్ ప్లే అందించారు అలాగే మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని నాగబాబు నిర్మాణం వహించారు.