టాక్..”బ్రో” లో ‘గుడుంబా శంకర్’ ట్రీట్.?

Published on May 31, 2023 7:06 am IST


ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు తన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ లో దర్శకుడు సముద్రకని తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ చిత్రం “బ్రో ద అవతార్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం మీద మంచి అంచనాలు అంతకంతకూ పెరుగుతూ వస్తుండగా ఈ సినిమాపై లేటెస్ట్ గా ఓ క్రేజీ న్యూస్ అయితే వైరల్ గా మారింది.

ఈ చిత్రంలో థమన్ పవన్ వింటేజ్ ట్యూన్స్ ని మిక్స్ చేస్తున్నాడని ఇది వరకే తెలియగా లేటెస్ట్ గా అయితే ఓ సాంగ్ కోసం పవన్ నటించిన గుడుంబా శంకర్ చిత్రం నుంచి కిళ్ళీ కిళ్ళీ సాంగ్ లో బిట్ అయితే ఈ సినిమాలో ప్లాన్ చేస్తున్నట్లు గా ఇప్పుడు తెలుస్తోంది. దీనితో అయితే అసలు ఇదో రీమేక్ అనే విషయమే పక్కకు వెళ్లిపోయినట్టు అని చెప్పాలి. మరి క్రేజీ మార్పులు ఎలా ఉంటాయో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :