150 స్క్రీన్లలో రిలీజ్ కానున్న గల్ఫ్ !
Published on Oct 12, 2017 12:58 pm IST

‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ, గంగ పుత్రులు’ వంటి సినిమాల్ని డైరెక్ట్ చేసిన దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తాజాగా రూపొందిన చిత్రం ‘గల్ఫ్’. సామాజిక సందేశమే లక్ష్యంగా రూపొందిన ఈ చిత్రం రేపే రిలీజ్ కానుంది. ఈ సినిమా ద్వారా గల్ఫ్ వలస బాధితులు పడుతున్న కష్టాల్ని ప్రభుత్వాలకు చూపి, వారి పట్ల స్పందించేలా చేయాలనేది తన ఉద్దేశ్యమని సునీల్ కుమార్ రెడ్డి అన్నారు.

చేతన్, డింపుల్ హయాతి జంటగా నటించిన ఈ చిత్రాన్ని రేపు మన్హసి స్థాయిలోనే రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 120 స్క్రీనలోను, కర్ణాటకలో 15 స్క్రీన్లు, ఓవర్సీస్లో 15 స్క్రీన్లు మొత్తం కలిసి దగ్గర దగ్గర 150 స్క్రీన్లలో విడుదలకానుంది. శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన ఈ 16వ చిత్రాన్ని యెక్కలి రవీంద్రబాబు నిర్మించారు. రెండు గంటల 14 నిముషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో సామాజిక అంశంతో పాటు మంచి ప్రేమ కథ కూడా ఉండనుంది.

 
Like us on Facebook