విశ్వక్ సేన్ “మెకానిక్ రాకీ” నుండి గుల్లెడు గుల్లెడు సాంగ్ రిలీజ్!

విశ్వక్ సేన్ “మెకానిక్ రాకీ” నుండి గుల్లెడు గుల్లెడు సాంగ్ రిలీజ్!

Published on Aug 7, 2024 5:53 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ హీరో చివరిసారిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో కనిపించాడు. ఈ చిత్రం ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. తదుపరి మెకానిక్ రాకీ చిత్రంలో కనిపించనున్నాడు. అక్టోబర్ 31, 2024 న థియేటర్ల లోకి రాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం నుండి గుల్లెడు గుల్లెడు సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సాంగ్ ఆడియెన్స్ ను అలరిస్తుంది. సుద్దాల అశోక్ తేజ ఈ పాటకి లిరిక్స్ రాయగా, మంగ్లీ పాటను పాడారు. జేక్స్ బెజొయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

పాట కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు