రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న “గల్లీ రౌడీ”..!

Published on Sep 5, 2021 12:03 am IST


యంగ్ హీరో సందీప్‌ కిషన్, నేహా శెట్టి హీరోయిన్‌గా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరెకెక్కిన సినిమా ‘గల్లీ రౌడీ’. స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్‌ సమర్పణలో, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 17న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

కోన వెంకట్ రచయితగా వ్యవహరిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్, టీజర్స్‌, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో రాజేంద్ర ప్ర‌సాద్‌ ఇంపార్టెంట్ రోల్ చేస్తుండగా, కోలివుడ్ యాక్టర్ బాబీ సింహ విలన్‌గా నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :