వరుణ్ తేజ్ కొత్త సినిమా అతనితోనేనా ?

17th, September 2016 - 01:14:55 PM

vijay-kumar-konda
‘ముకుంద, కంచె, లోఫర్’ వంటి చిత్రాలతో మెగా ఫ్యామిలీకి ఇమేజ్ కు న్యాయం చేసి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో వరుణ్ తేజ్. ప్రస్తుతం ఈ యువ హీరో సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అందుకే దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి ‘మిస్టర్’, శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ‘ఫిదా’ అనే రెండు సినిమాలను ఏకకాలంలో చేస్తున్నాడు. అలాగే సినీ వర్గాల నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం తేజ్ మరో కొత్త సినిమాను మొదలుపెట్టనున్నాడని తెలుస్తోంది.

‘గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం’ వంటి చిత్రాలను తెరకెక్కించిన విజయ్ కొండా దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రం కూడా లవ్ ఎంటర్టైనర్ గానే ఉండబోతోందట. ఈ చిత్రం తాలూకు రెగ్యులర్ షూటింగ్ 2017 ఆరంభంలో మొదలవుతుందని వినికిడి. కానీ ఈ విషయంపై విజయ్ కొండా గాని, వరుణ్ తేజ్ గాని ఎటువంటి ప్రకటన చేయలేదు.