కృష్ణ, గుంటూరులో “పుష్ప 2” డే 1 వసూళ్లు ఎంతంటే..

కృష్ణ, గుంటూరులో “పుష్ప 2” డే 1 వసూళ్లు ఎంతంటే..

Published on Dec 6, 2024 1:04 PM IST

లేటెస్ట్ గా పాన్ ఇండియా సినిమా దగ్గర హాట్ టాపిక్ గా మారిన భారీ చిత్రం ఏదన్నా ఉంది అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన అవైటెడ్ బిగ్ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ అని చెప్పాలి. మరి మంచి హైప్ నడుమ వచ్చిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ హైక్స్ తో గ్రాండ్ గా రిలీజ్ కి వచ్చింది.

అయితే ఈ చిత్రం వసూళ్లు పలు ఏరియాలకి సంబంధించి తెలుస్తున్నాయి. లేటెస్ట్ గా కృష్ణ మరియు గుంటూరు జిల్లాలో డే 1 షేర్ వసూళ్లు బయటకి వచ్చాయి. వీటి ప్రకారం పుష్ప 2 గుంటూరులో 6.3 కోట్ల షేర్ ని అన్ని జీఎస్టీ కలిపి వసూలు చేయగా కృష్ణా జిల్లాలో మొదటి రోజు 4.4 కోట్ల షేర్ ని అందుకుంది. దీనితో పుష్ప 2 సాలిడ్ స్టార్ట్ ని ఏపీలో కూడా అందుకుంది అని చెప్పాలి. అలాగే మిగతా ఏరియాలకి సంబంధించి ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు