‘గుంటూరు కారం’ : సెట్స్ నుండి లీక్ అయిన మరొక పిక్

Published on Sep 22, 2023 12:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం. ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తుండగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ లోని పలు లొకేషన్స్ లో వేగంగా షూటింగ్ జరుగుతోంది.

అయితే మ్యాటర్ ఏమిటంటే, ఇప్పటికే గుంటూరు కారం నుండి అక్కడక్కడా కొన్ని పిక్స్, వీడియోలు లీక్ అయ్యాయి. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ చేస్తోన్న ఒక ఫైట్ సీన్ కి సంబంధించిన పిక్ ఒకటి లీక్ అయి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నిజానికి ఈ విధంగా వరుసగా లీక్స్ వస్తుండడంతో గుంటూరు కారం టీమ్ ఇకపై ఈ లీక్స్ కి అడ్డుకట్ట వేయడానికి మరింత గట్టి చర్యలు తీసుకోనున్నట్లు చెప్తున్నారు. కాగా ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :