‘గుంటూరు కారం’ : ఐటమ్ సాంగ్ కి కొరియోగ్రఫీ అందించనున్న ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ?

Published on Sep 23, 2023 2:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం యొక్క తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లోని పలు లొకేషన్స్ లో వేగంగా జరుగుతోంది. మహేష్ బాబు ఈ మూవీలో చాలా ఏళ్ళ తరువాత మంచి పవర్ఫుల్ మాస్ రోల్ చేస్తుండగా కీలక పాత్రల్లో జగపతి బాబు, రమ్యకృష్ణ, రఘుబాబు, సునీల్, అజయ్, జయరాం తదితరులు నటిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండగా ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

అయితే మ్యాటర్ ఏమిటంటే, గుంటూరు కారం స్టోరీ, స్క్రిప్ట్, యాక్షన్, ఫైట్స్, మాస్ సీన్స్, ఎలివేషన్స్ తో పాటు మ్యూజిక్, బీజీఎమ్ విషయంలో కూడా డైరెక్టర్ త్రివిక్రమ్ పక్కాగా శ్రద్ధ తీసుకుంటున్నారట. ముఖ్యంగా తన కెరీర్ లో ఈ మూవీలో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. కాగా ఈ సాంగ్ లో ఒక స్టార్ హీరోయిన్ నటించనుండగా ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ అయిన శేఖర్ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ అందిచనున్నారట. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఆయన కంపోజ్ చేసిన సరిలేరు నీకెవ్వరు లోని మైండ్ బ్లాక్, అలానే సర్కారు వారి పాట లోని మ మ మహేష్ సాంగ్స్ కి సూపర్ రెస్సాన్స్ లభించింది.

అయితే వాటిని మించేలా మరింత అద్భుతంగా ఈ సాంగ్ లో డ్యాన్స్ ఉంటుందని అంటున్నారు. సాంగ్స్ అన్ని కూడా అవుట్ పుట్ అదిరిపోయాయని, బీజీఎమ్ కూడా మరొక రేంజ్ లో ఉంటుందని సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరికీ ఈ మూవీ ఫుల్ ఐ ఫీస్ట్ ని అందించడం ఖాయం అంటోంది యూనిట్. ఇక ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తుండగా దీనిని 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :