‘గుంటూరు కారం’ : ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించిన నిర్మాత నాగవంశీ

Published on Oct 3, 2023 12:30 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం. ఈ మూవీ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈమూవీని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న గుంటూరు కారం మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఆడియన్స్ ముందుకి రానుంది.

ఇక తాజాగా మ్యాడ్ మూవీ యొక్క ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో ఈ మూవీ నిర్మాత ఎస్. నాగవంశీ మాట్లాడుతూ, తాము ముందుగా వెల్లడించినట్లే పక్కాగా జనవరి 12న గుంటూరు కారం మూవీ థియేటర్స్ లో ఉంటుందని అన్నారు. అలానే మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ని దసరా కంటే ముందే రిలీజ్ చేస్తాం అని, ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చాలా రోజుల తరువాత ఫుల్ ఎనర్జిటిక్ రోల్ లో నటిస్తున్నారని అన్నారు. సంక్రాంతికి సూపర్ ఫ్యాన్స్ గుంటూరు కారంతో పెద్ద సంబరం చేసుకోవడం ఖాయం అని తెలిపారు. నాగవంశీ క్లారిటీతో గుంటూరు కారం రిలీజ్ పై రూమర్స్ కి చెక్ పడడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :