‘గుంటూరు కారం’ : సెకండ్ సాంగ్ అప్ డేట్ అందించిన ప్రొడ్యూసర్ నాగవంశీ

Published on Nov 20, 2023 7:15 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ దమ్ మసాలా చార్ట్ బస్టర్ గా నిలిచి అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

కాగా మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్ కోసం అందరూ ఎదురుచూస్తుండగా కొద్దిసేపటి క్రితం ఒక ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, సినిమా నుండి సెకండ్ సాంగ్ ని వచ్చే వారం రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అలానే ఈ సాంగ్స్ అన్నీ కూడా ఏడాది మొత్తం కూడా అందరూ పాడుకునేంతటి అద్భుతంగా ఉంటాయని తెలిపారు. కాగా గుంటూరు కారం మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :