ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన ‘గుంటూరు కారం’ మాస్ స్ట్రైక్

Published on Jun 2, 2023 12:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై దీనిని గ్రాండ్ లెవెల్లో సూర్య దేవర రాధాకృష్ణ నిర్మిస్తుండగా థమన్ సంగీతాన్ని, పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఈ భారీ ఫ్యామిలి యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ నుండి నిన్న సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మాస్ స్ట్రైక్ పేరుతో ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్.

కాగా ఆ గ్లింప్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు పవర్ఫుల్ మాస్ లుక్, స్టైల్, స్వాగ్, బీజీఎమ్, విజువల్స్ వంటివి అందరినీ ఆకట్టుకుని సూపర్ రెస్సాన్స్ సొంతం చేసుకున్నాయి. అయితే విషయం ఏమిటంటే, తాజగా ఈ మాస్ స్ట్రైక్ గ్లింప్స్ 24 గంటల్లో ఏకంగా 25 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డు సొంతం చేసుకుని ఇంకా యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. కాగా గుంటూరు కారం మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2024 జనవరి 13 న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం :