‘గుంటూరు కారం’ : ఆ విషయంలో తగ్గేదే లేదు అంటున్న మేకర్స్

Published on Sep 27, 2023 12:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు కలిగిన ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

మరోవైపు ఈ మూవీకి అదరగొట్టే ట్యూన్స్ ని సిద్ధం చేశారట సంగీత దర్శకుడు థమన్. అతి త్వరలో గుంటూరు కారం నుండి ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉందంటున్నాయి సినీ వర్గాలు. అయితే ఈ మూవీని రానున్న 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ మూవీ పోస్ట్ పోన్ కానుందని ఇటీవల వార్తలు వచ్చాయి.

వాటిలో ఏమాత్రం వాస్తవం లేదని తప్పకుండా గుంటూరు కారం సంక్రాంతి కి థియేటర్స్ లో ఉంటుందని కొన్నాళ్ల క్రితం హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక కార్యక్రమంలో భాగంగా తెలిపారు. ఇక మళ్ళీ తాజాగా గుంటూరు కారం పోస్ట్ పోన్ ఫిక్స్ అంటూ కొన్ని మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి. అయితే వీటిపై గట్టిగా స్పందించిన మేకర్స్, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, ఎట్టిపరిస్థితుల్లో తమ మూవీ పక్కాగా జనవరి 12న సంక్రాంతి కి రిలీజ్ అవడం ఫిక్స్ అని, అటువంటి పుకార్లు నమ్మవద్దని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :