‘గుంటూరు కారం’ : ఫస్ట్ సాంగ్ కోసం అప్పటివరకు ఆగాల్సిందేనా ?

Published on Sep 14, 2023 3:00 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ యాక్షన్ మూవీ గుంటూరు కారం పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీలో మహేష్ బాబు చాలా కాలం తరువాత మంచి మాస్ పవర్ఫుల్ రోల్ చేస్తుండగా ఇతర కీలక రోల్స్ లో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, సునీల్, రఘుబాబు, జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు.

అయితే ఇప్పటికే ఫస్ట్ లుక్ గ్లింప్స్ తో అందరిలో మరింత హైప్ ఏర్పరిచిన గుంటూరు కారం నుండి ఫస్ట్ సాంగ్ ని వచ్చే నెలలో దసరా సందర్భంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారనేది టాలీవుడ్ లేటెస్ట్ బజ్. నిజానికి వినాయక చవితి సందర్భంగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వలన దాని రిలీజ్ ని దసరాకి మార్చారని తెలుస్తోంది. అయితే దీని పై మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం రావాల్సి ఉంది. హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ 2024 జనవరి 12న ఆడియన్స్ ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :