ఇంటర్వ్యూ: ప్రగ్య జైస్వాల్ – ఇన్నాళ్లకు నాకు కరెక్టుగా సరిపోయే సినిమా దొరికింది !
Published on Feb 27, 2017 5:59 pm IST


‘కంచె’ సినిమాతో హీరోయిన్ గా ఫిలిం ఫేర్, సైమ అవార్డులను గెలుచుకున్న హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ ప్రస్తుతం మంచు మనోజ్ ‘గుంటూరోడు’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం మార్చి 3న రిలీజవుతున్న సందర్బంగా మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆ సంగతులు మీకోసం..

ప్ర) ‘గుంటూరోడు – లవ్ లో పడ్డాడు’ ఈ ట్యాగ్ లైన్ కి అర్థమేమిటి ?
జ) అంటే నాకు పర్ఫెక్ట్ గా తెలీదు. కానీ ఇందులో మనోజ్ చాలా మాస్ లుక్ తో కనిపిస్తాడు. కాబట్టి ఫైట్స్, స్టంట్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటే ఒక బలమైన లవ్ ట్రాక్ కూడా నడుస్తుంటుంది. అంత మాస్ అబ్బాయి లవ్ స్టోరీ ఏంటనేది సినిమాలోని ముఖ్యమైన పాయింట్స్ లో ఒకటి.

ప్ర) ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) నేను చేసిన ‘కంచె, ఓం నమో వేంకటేశాయ’ సినిమాల్లో నావి హిస్టారికల్ క్యారెక్టర్స్. అవన్నీ డెరెక్టర్స్ పాత్రలు. కానీ ఇందులో మాత్రం పక్కా గుంటూరు అమ్మాయిలా చాలా సాధారణంగా కనిపిస్తాను. చాలా స్వీట్ గా, అందంగా ఉంటుంది. అందుకే ఈ సినిమాకి సైన్ చేశాను. ఇది నా రియల్ లైఫ్ కు చాలా దగ్గరగా ఉంటుంది.

ప్ర) మనోజ్ తో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) అతను నాకో మంచి స్నేహితుడిలా ఉంటాడు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఎప్పుడూ జోక్స్ వేస్తూ నవ్విస్తుంటాడు. ఎప్పుడూ ఎన్టజిటిక్ గా ఉంటాడు. జోక్స్ వేస్తూనే కెమెరా ముందుకెళితే టక టకా డైలాగ్స్ చెప్పేస్తుంటాడు. ఫైట్స్, డ్యాన్సుల్లో కొంచెం ఎమోషనల్ గా ఉంటాడు.

ప్ర) డైరెక్టర్ వర్క్ ఎలా ఉంది ?
జ) సత్య.. ఒక మంచి డైరెక్టర్ మాత్రమే కాదు మంచి రైటర్ కూడా. అతని వర్క్ చాలా బాగుంటుంది. అతను చెప్పే ప్రతి పాయింట్స్, తీసే ప్రతి సీన్ సినిమాకి ఎక్కడో ఒక దగ్గర కనెక్టయ్యే ఉంటుంది. ఆయన చెప్పే ప్రతి పాయింట్ చాలా సాధారణంగా, వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అన్నీ కరెక్టుగా ఉండేలా చూసుకున్నారు. మంచి యాక్టర్.

ప్ర) హైదరాబాద్ తో మీ రిలేషన్ ఎలా ఉంది ?
జ) హైదరాబాద్ నాకు రెండవ ఇల్లు లాంటిది. ఈ సినిమాకోసం వరుస ఆరు నెలలు ఇక్కడే ఉన్నాను. ఇక్కడి జనాలు చాలా మంచివారు. నిజాయితీగా ఉంటారు. అందుకే నాకు ఈ సిటీ అంటే చాలా ఇష్టం. ఇక్కడి ఫుల్ కూడా చాలా బాగుంటుంది.

ప్ర) మీ ‘నక్షత్రం’ గురించి ఏమైనా చెప్పండి ?
జ) ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అందులో నేనొక పోలీస్ పాత్ర చేస్తున్నాను. ఎప్పుడు చేయని చాలా విషయాలు ఇందులో చేశాను. నా పాత్ర ఒకవైపు సీరియస్ గా ఉంటూనే చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటుంది. చాలా ఫైట్స్ చేశాను. ఆ క్యారెక్టర్ కృష్ణవంశీ గారి స్టైల్లో ఉంటుంది.

ప్ర) లాస్ట్ సినిమాలు రెండు క్లాస్ సినిమాలు, ఇదేమో మాస్ సినిమా ఎలా అనిపించింది ?

జ) కంచె లాంటి సినిమాకి పని చేయడం ఒక డిఫరెంట్ అనుభవం. డైరెక్టర్ క్రిష్ ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తూ ఉంటారు. నడిచినా, కూర్చున్నా సినిమా ఆలోచనలోనే ఉంటారు. టీమ్ కూడా ఏం మాట్లాడుకున్న అది సినిమా గురించే అయ్యుంటుంది. అందుకే అంత పెద్ద సినిమాని చాలా తక్కువ టైమ్ లో కంప్లీట్ చేశాం. కృష్ణవంశీగారు కూడా అంతే. కానీ ఈ సినిమా మాత్రం డిఫరెంట్. ప్రతి ఒక్కరు సీరియస్ గానే నికి పని చేస్తుంటారు. కానీ ఎప్పుడూ సెట్లో ఒక పార్టీలా ఉంటుంది.

 
Like us on Facebook