వాయిదా పడిన గుంటూరోడు ఆడియో లాంచ్ !

24th, January 2017 - 08:22:06 AM

gunturodu-1
మంచు మనోజ్ తాజాగా గుంటూరోడు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఈ చిత్ర ఆడియో లాంచ్ జనవరి 26 న జరగనున్నట్లు గతం లో చిత్ర యూనిట్ ప్రకటించింది.

కాగా ఈ చిత్ర ఆడియో లాంచ్ వాయిదా పడినట్లు మనోజ్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఈ చిత్ర ఆడియో విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపాడు.మనోజ్ తన సన్నిహితుల సలహా మేరకే ఆడియో లాంచ్ ని వాయిదా వేసినట్లు తెలిపాడు. కాగా ఈ చిత్రంలో మనోజ్ సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.