సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం డే 1 సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం రెండు రోజుల వసూళ్లకి సంబందించిన సరికొత్త పోస్టర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్రం రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 127 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇది సెన్సేషన్ అని చెప్పాలి.
సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించగా, మీనాక్షి చౌదరి, రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జగపతి బాబు, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.