10 ఏళ్ల జైలు శిక్షకు గురైన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ !


గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. గత కొన్ని రోజులుగా ఈ పేరు దేశం మొత్తం అలజడి సృష్టిస్తున్న సంగతి తెల్సిందే. 19912లో తన ఇద్దరు మహిళా అనుచరుల్ని అత్యాచారం చేసిన కేసులో హర్యానాలో గత వారం అరెస్టైన గుర్మీత్ కు హర్యానాలోని రోతక్ జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు 10 ఏళ్ల పాటు జైలు శిక్షను విధించింది.

సీబీఐ జడ్జ్ శిక్షను ఖరారు చేయగానే గుర్మీత్ అక్కడికక్కడే రోదిస్తూ కుప్పకూలిపోయాడు. గుర్మీత్ అరెస్టుకు నిరసనగా ఆయన అనుచరులు సిస్రాలో విధ్వంసకాండకు పాల్పడగా ఆ అల్లర్లలో 38 మంది మరణించడంతో పాటు 200 లకు పైగా గాయపడగా కోట్లాది రూపాయల ప్రభుత్వ, పైవేటు ఆస్తులు నాశనమయ్యాయి. డేరా సచ్చా సౌదా అనే ఆధ్యాత్మిక సంస్థను నడిపే గుర్మీత్ నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, రచయిత కూడ. గతంలో ఆయన ఎమ్మెస్జీ పేరుతో మూడు సినిమాల సిరీస్ ను, అలాగే మరో రెండు సినిమాల్ని చేశారు. వాటిలో ఒకటి తెలుగులో కూడా విడుదలైంది.