తొలిరోజు ‘గురు’ ఆరంభం అదిరింది !


విక్టరీ వెంకటేష్ నటించిన గురు చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తో ఈ చిత్రం దూసుకుపోతోంది. సినీ విమర్శకుల రివ్యూ లలో కూడా ఈ చిత్రానికి మంచి రేటింగ్స్ లభించాయి.వీటన్నింటినీ అనుకూలంగా మార్చుకున్న గురు చిత్రం తొలి రోజు మంచి వసూళ్లను రాబట్టడం విశేషం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ 2.51 కోట్ల షేర్ ని సాధించింది.హిందీ చిత్రమైన సాలా ఖండూస్ కి ఈ చిత్రం రీమేక్ గా వచ్చిన విషయం తెలిసిందే.ఈ చిత్రం లో వెంకటేష్ నటన ప్రధాన హైలైట్ గా చెబుతున్నారు.