‘గురు’ వాయిదా హృతిక్ రోషన్ కు కలిసొచ్చే అంశం !
Published on Jan 18, 2017 3:14 pm IST

guru-balam
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ ఎన్నడూ లేని విధంగా ఈసారి టాలీవుడ్ పరిశ్రమపై కాస్త ఎక్కుక దృష్టి పెట్టారు. అయన నటించిన ‘కాబిల్’ తెలుగులో కూడా ‘బలం’ పేరుతో ఏపీ, తెలంగాణాల్లో జనవరి 25న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ‘భజరంగీ భాయి జాన్, సుల్తాన్, దంగల్’ వంటి సినిమాలు తెలుగులో మంచి ఆదరణ పొందడంతో భిన్నమైన కధాంశంతో తెరకెక్కిన ‘బలం’ కూడా మంచి విజయాన్ని సాదిస్తుందని చిత్ర హక్కుల్ని కొన్న డిస్ట్రిబ్యూటర్లు చాలా నమ్మకంగా ఉన్నారు.

దానికి తోడు జనవరి 26న రిలీజ్ కావాల్సిన విక్టరీ వెంకటేష్ ‘గురు’ చిత్రం వాయిదా పడటం హృతిక్ కు మరింత కలిసొచ్చే అంశంగా మారనుంది. ‘గురు’ వెనక్కి వెళ్లడంతో వచ్చే వారం ‘సింగం 3’ మినహా ‘బలం’ కు పోటీగా మరే పెద్ద సినిమా విడుదలకావడం లేదు. దీంతో తెలుగులో ‘బలం’ మంచి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ కూడా తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుని సినిమాపై ఒక రకమైన అనుకూల భావాన్ని కలిగించాయి. సంజయ్ గుప్త డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో హృతిక్, యామి గౌతమ్ ఇద్దరూ చూపులేని వ్యక్తులుగా నటించారు.

 
Like us on Facebook