అభిమానులకు వెంకీ ఇచ్చే బర్త్‌డే గిఫ్ట్ ఇదే!

30th, November 2016 - 05:54:25 PM

guru
విక్టరీ వెంకటేష్ మళ్ళీ బ్యాక్ టూ ఫాం అంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈమధ్యే ‘గురు’ షూటింగ్ పూర్తి చేసిన ఆయన, త్వరలోనే ఓ కొత్త సినిమాను మొదలుపెట్టేందుకు సిద్ధమవుతూనే, గురును రిలీజ్‌కు కూడా సిద్ధం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్‌ను విడుదల చేసేందుకు రెడీ అయిపోయారు. డిసెంబర్ 13న వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకొని అభిమానులకు ప్రత్యేక కానుకగా ఈ టీజర్ విడుదల కానుంది.

తమిళ, హిందీ భాషల్లో మంచి విజయం సాధించిన ‘సాలా ఖదూస్‌’కి రీమేక్ అయిన ఈ సినిమాలో వెంకీ ఓ బాక్సింగ్ కోచ్‌గా కనిపించనున్నారు. రితికా సింగ్ మరో ప్రధాన పాత్రలో నటించగా, సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను వై నాట్ స్టూడియోస్ నిర్మిస్తోంది.