ఇరుముడి : విల్లాలి వీరుడు.. వీర మణికంఠుడు.. పూనకాలు ఖాయం..!

Irumudi

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఇరుముడి’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. భక్తిరస చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను భక్తి అంశాలతో పాటు మంచి కమర్షియల్ హంగులతో రూపొందిస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

కాగా, ఆయన ఈ సినిమా మ్యూజిక్ గురించి తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ‘ఇరుముడి’ చిత్రంలో ప్రముఖ అయ్యప్ప భజన పాట అయిన ‘విల్లాలి వీరుడు.. వీర మణికంఠుడు’ పూనకాలు తెప్పించే విధంగా ఉండబోతుందని ఆయన హింట్ ఇచ్చారు. గతంలో ఇదే విషయంపై ఆయనను ప్రశ్నించగా ఆ పాట కోసం భారీగా డిమాండ్ ఉందని.. తమ దర్శకనిర్మాతలు ఒప్పుకుంటే ఆ పాటను ఖచ్చితంగా పెడతామని ఆయన చెప్పుకొచ్చాడు.

ఇక ఇప్పుడు ఆ పాటను రీమిక్స్ చేస్తున్నట్లు ఆయన అధికారికంగా హింట్ ఇచ్చారు. ఈ పాటకు థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version