అజిత్ కన్ను ఆ దర్శకుడిపై పడింది !

ajith

తమిళ స్టార్ హీరో అజిత్ తన దర్శకుల పట్ల చూపే ఆదరణ చాలా గొప్పగా ఉంటుంది. వర్క్ నచ్చి ఒకసారి ఏ దర్శకుడి మీదైనా ఆయనకు నమ్మకం కలిగితే ఎన్నిసార్లైనా అతనితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉంటారు అజిత్. అందుకు ఉదాహరణే దర్శకుడు శివ. 2014లో శివతో ‘వీరమ్’ అనే సినిమా చేసిన అజిత్ 2019 వరకు వేరొక వేరొక దర్శకుడి వద్దకు వెళ్లకుండా శివతోనే ఇంకో మూడు సినిమాలు చేశారు.

ఇప్పుడు అలాంటి అవకాశమే డైరెక్టర్ హెచ్. వినోత్ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈయన అజిత్ ప్రధాన పాత్రలో హిందీ హిట్ సినిమా ‘పింక్’ను తమిళంలోకి రీమేక్ చేస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన షూట్ తాలూకు ఔట్ ఫుట్ అజిత్‌కు బాగా నచ్చిందట. అందుకే తన 60వ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం అతనికే అప్పగించాడట. వినోట్ ఆ సినిమా కూడా బాగా తీయగలిగితే అజిత్ అతనికి ఇంకో ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Exit mobile version