ఆసక్తిరేపుతున్న హెబ్బా పటేల్ కొత్త చిత్రం !


‘కుమారి 21 ఎఫ్, ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకుని లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హెబ్బా పటేల్ చేస్తున్న సినిమాల్లో ‘ఏంజెల్’ కూడా ఒకటి. ఫిబ్రవరి నెలాఖరులో షూటింగ్ మొత్తమ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యొక్క టీజర్ రేపే విడుదలకానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా మాత్రమే గాక సోషియో ఫాంటసీ చిత్రంగా కూడా ఉండటంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. పైగా ఇటీవలే విడుదలైన సినిమా పోస్టర్ కూడా కొత్తగా ఉండటంతో ప్రేక్షకుల్లో కూడా సినిమా పట్ల ఉత్సుకత మొదలైంది.

మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని మే నెలలో రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు నిర్మాతలు. ఇప్పటికే సంగీత దర్శకుడు భీమ్స్ అన్ని పాటలను పూర్తి చేసేశాడు. సరస్వతి ఫిలిమ్స్ పతాకంపై ముప్పా వెంకయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాహుబలి పళని డైరెక్ట్ చేస్తున్నారు. ఇకపోతే హెబ్బా పటేల్ వరుణ్ తేజ్ సరసన ‘మిస్టర్’ లో కనిపించగా రాజ్ తరుణ్ తో ‘అందగాడు’ సినిమాలో నటిస్తోంది.