విజయ్ “బీస్ట్” నుండి హాలమితీ హబిబో తెలుగు సాంగ్ రిలీజ్!

Published on Apr 4, 2022 5:00 pm IST


తలపథీ విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం బీస్ట్. ఈ చిత్రం ను సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుద్ రవి చందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రం ను కేవలం తమిళ్ లో మాత్రమే కాకుండా, దేశం లోని ప్రముఖ బాషల్లో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ మేరకు సెన్సేషన్ క్రియేట్ చేసిన అరబిక్ కుతు తెలుగు లిరికల్ వీడియో సాంగ్ ను తాజాగా విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ను ఏప్రిల్ 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేయడం జరిగింది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :