హాఫ్ బిలియన్ వ్యూస్ తో దూసుకు పోతున్న బన్నీ సెన్సేషనల్ సాంగ్!

Published on May 13, 2022 7:30 pm IST


అల్లు అర్జున్ సాలిడ్ కమ్ బ్యాక్ మూవీ అయిన అల వైకుంఠ పురములో చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఎన్నో రికార్డ్ లను క్రియేట్ చేయడం జరిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం లోని పాటలు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో బాలీవుడ్ సెలబ్రిటీ ల నుండి స్పోర్ట్స్ పర్సన్స్ సైతం ఈ చిత్రం లోని పాటలకు తమదైన శైలిలో స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు.

ఈ చిత్రం లో రాములో రాములా పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు యూ ట్యూబ్ లో హాఫ్ బిలియన్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. 500 మిలియన్ వ్యూస్ తో పాటుగా ఈ పాటకి 2.5 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఈ చిత్రం లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా, సుశాంత్, నివేథా పేతు రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :