వైరల్ : లేటెస్ట్ లుక్ లో అదరగొట్టిన హ్యాండ్సమ్ హంక్ మహేష్

Published on Sep 26, 2023 2:19 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “గుంటూరు కారం” కోసం అందరికి తెలిసిందే. మరి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం మహేష్ తన గత చిత్రం “సర్కారు వారి పాట” కి ప్లాన్ చేసిన లాంగ్ హెయిర్ లోనే తాను ఉండిపోయాడు. ఇక గుంటూరు కారం కి కూడా ఇదే లుక్ ని కాస్త గడ్డం పెంచి మైంటైన్ చేసి మాస్ లుక్ లోకి అయితే తాను మారాడు.

మరి తన లుక్స్ పరంగా అయితే ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్న మహేష్ లేటెస్ట్ మరో సాలిడ్ లుక్ ఇప్పుడు బయటకి వచ్చి వైరల్ గా మారింది. అయితే ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ అయితే మహేష్ బాబు లేటెస్ట్ మేకోవర్ పిక్ ని పోస్ట్ చేసాడు. దీనితో ఈ పిక్ యిట్టె వైరల్ గా మారిపోయింది. మరి ఇందులో మహేష్ సూపర్ స్టైలిష్ అండ్ చాలా హ్యాండ్సమ్ గా కూడా కనిపిస్తున్నాడు. దీనితో ఈ లుక్ లో మహేష్ ని చూసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :