షూటింగ్ లో గాయపడ్డ హీరోయిన్ !

హీరోయిన్ హన్సిక షూటింగ్ లో గాయపడింది. ప్రస్తుతం ఆమె ‘మహా’ అనే చిత్రంలో నటిస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ లో భాగంగా యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్న సందర్భంలో హన్సిక స్లిప్ అయ్యి జారీ పడింది. దాంతో ఆమె చెయ్యికి గాయం అయ్యిందని సమాచారం. అయితే గాయం తరువాత కూడా హన్సిక షూటింగ్ ను కొనసాగించిందట. ఇక ఈ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు చాలా కీలకం కానున్నాయి.

నూతన దర్శకుడు జమీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఇది హన్సిక కు 50వచిత్రం కావడం విశేషం. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు ,తమిళ భాషల్లో విడుదలకానుంది.

Exit mobile version