ఆ రూమర్స్ లో ఏ మాత్రం నిజం లేదు – హీరోయిన్ హన్సిక క్లారిటీ

Published on May 24, 2023 1:20 am IST


తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఆడియన్స్, ఫ్యాన్స్ ని మెప్పించి మంచి పేరు అందుకున్న వారిలో హన్సిక మోత్వానీ కూడా ఒకరు. హన్సిక ఇటీవలే బిజినెస్ టైకూన్ సోహైల్ ఖతురియాను వివాహం చేసుకుని ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు. విషయం ఏమిటంటే తన కెరీర్ ప్రారంభంలో ఒక టాప్ టాలీవుడ్ హీరో ఆమెను వేధించాడని, అలానే ఆ హీరో నటిని చాలాసార్లు డేట్ అడిగాడని హన్సిక కి సంబందించిన ఒక రూమర్ రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ఆ తెలుగు హీరో ఎవరై ఉంటారు అనే దానిపై నెటిజన్స్ లో ఒకింత చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తాజాగా హన్సిక స్వయంగా స్పష్టం చేసారు. ఈ నిరాధారమైన ఊహాగానాలతో తాను విసుగు చెందానని ఇలాంటి కథనాలను ప్రచురించే ముందు వాస్తవాలను తెలుసుకుని పోస్ట్ చేయాలని ఆమె మీడియాను కోరింది. ఇక కెరీర్ పరంగా ప్రస్తుతం హన్సిక మోత్వాని పార్టనర్, 105 మినిట్స్, నా పేరు శృతి, రౌడీ బేబీ, గాంధారి మరియు గార్డియన్ సినిమాల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :