లేటెస్ట్ : హను, కళ్యాణ్ రామ్ ల ట్వీట్స్ వైరల్

Published on Aug 5, 2022 1:00 am IST

ప్రేక్షకాభిమానులు అందరూ ఎప్పటినుండో ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న రెండు మూవీస్ బింబిసార, సీతారామం నేడు రిలీజ్ అవుతున్నాయి. హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్స్ గా నటించగా యుద్ధంతో రాసిన ప్రేమకథ గా ఇది తెరకెక్కింది. కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన సోషియా ఫాంటసీ మూవీ బింబిసార. సంయుక్తా మీనన్, వరీన హుస్సేన్, క్యాథరీన్ త్రెసా హీరోయిన్స్ గా నటించారు.

అయితే బింబిసార మూవీ మంచి సక్సెస్ అందుకోవడంతో పాటు సినిమా గెలవాలి ఇండస్ట్రీ ఎదగాలి అంటూ సీతారామం దర్శకుడు హను రాఘవపూడి తనని కోట్ చేస్తూ హను రాఘవపూడి ట్వీట్ చేసారు. అయితే దానికి బదులుగా, మీ మూవీ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి తప్పకుండా త్వరలో మూవీ చూస్తాను, అలానే సినిమా అనేది ఫైనల్ గా గెలవాలి అంటూ హను రాఘవాపుడి ట్వీట్ కి నందమూరి కళ్యాణ్ రామ్ రీట్వీట్ చేసారు. ఆ విధంగా ఎంతో ఆరోగ్యవంతంగా ఒకరి సినిమా గురించి మరొకరు పోస్ట్ చేసిన ఈ ట్వీట్స్ ప్రస్తుతం ట్విట్టర్ లో ఎంతో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :