‘హను మాన్’ : మూడవ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Nov 21, 2023 8:09 pm IST


యువ నటుడు తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ సూపర్ హీరో మూవీ హను మాన్. ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ పాన్ ఇండియన్ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కూడా అందరినీ ఆకట్టుకుని మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచేసాయి. అమృత అయ్యర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో వినయ్‌రాయ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు

కాగా తమ మూవీ నుండి నవంబర్ 28న మూడవ సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీకి శ్రీమతి చైతన్య సమర్పకురాలిగా వ్యవహరిస్తుండగా గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. శివేంద్ర సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ మూవీ జనవరి 12న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :