నార్త్ లో “హను మాన్” 4 రోజుల వసూళ్ల డీటెయిల్స్.!

నార్త్ లో “హను మాన్” 4 రోజుల వసూళ్ల డీటెయిల్స్.!

Published on Jan 16, 2024 10:02 PM IST

యువ నటీనటులు తేజ సజ్జ, అమృత అయ్యర్ లు హీరో హీరోయిన్స్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “హను మాన్”. మరి తెలుగు నుంచి మొదటి సూపర్ హీరో చిత్రంగా భారతదేశ ఇతిహాసాల కలయికలో తెరకెక్కి పాన్ ఇండియా ఆడియెన్స్ నుంచి మన్ననలు అందుకుంటుంది.

ఇక తెలుగు సహా నార్త్ అమెరికా లో కూడా వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం నార్త్ ఇండియాలో కూడా దుమ్ము లేపుతుంది. హిందీలో నాలుగు రోజుల రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం అక్కడ వర్కింగ్ డే సోమవారం కూడా మొదటి రోజు కన్నా ఎక్కువ వసూళ్లు సాధించింది.

డే 1 హిందీ వెర్షన్ లో 2.15 కోట్ల నెట్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం నాలుగో రోజు 3.8 కోట్లు రాబట్టింది. దీనితో మొత్తం నాలుగు రోజుల్లో హను మాన్ 16.17 కోట్ల మార్క్ ని అందుకొని సూపర్ స్ట్రాంగ్ గా దూసుకెళ్తుంది. ఇక ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని తదితరులు నటించగా నిరంజన్ రెడ్డి నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు