యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సెన్సేషనల్ డివోషనల్ హిట్ చిత్రం “హను మాన్”. మన తెలుగు నుంచి మొదటి సూపర్ హీరో సినిమాగా వచ్చిన ఈ చిత్రం భారీ హిట్ అయ్యి మిడ్ రేంజ్ సినిమాల్లో ఆల్ టైం రికార్డు వసూళ్లు అందుకుంటుంది.
ఇక రిలీజ్ రోజు నాటి నుంచే దుమ్ము లేపుతూ వస్తున్నా ఈ చిత్రం నైజాం మార్కెట్ లో అయితే మాసివ్ రన్ ని కొనసాగిస్తూ వచ్చింది. మరి మొత్తం 14 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నైజాం మార్కెట్ లో ఏ రకంగా రాణించడిందో ప్రతి డీటెయిల్ చూసినట్టు అయితే..
ఈ మొత్తం 14 రోజుల్లో హను మాన్ కి నైజాం లో 9027 షోస్ పడగా ఈ షోస్ లో మొత్తం 25 లక్షల 28 వేల 983 మంది ప్రేక్షకులు సినిమాని థియేటర్స్ లో వీక్షించారు. దీనితో ఈ 4 రోజుల్లో మొత్తం 48 కోట్ల 62 లక్షల 29 వేల 176 రూపాయల గ్రాస్ న్నీ కలెక్ట్ చేయగా ఇందులో విత్ జి ఎస్ టి 29 కోట్ల 51 లక్షల 55 వేల 263 రూపాయల షేర్ ని అందుకోగా జి ఎస్ టి కాకుండా 25 కోట్ల 01 లక్షల 31 వేల 579 షేర్ ని రాబట్టి భారీ సక్సెస్ ని ఈ చిత్రం సొంతం చేసుకుంది. అలాగే ఇప్పుడు కూడా స్ట్రాంగ్ బుకింగ్స్ తో ఈ చిత్రం దూసుకెళ్తుంది.