ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి వచ్చిన రిలీజ్ కి అవైటెడ్ చిత్రాల్లో భారీ చిత్రం హను మాన్” కోసం తెలిసిందే. సాలిడ్ హైప్ నడుమ మేకర్స్ పెట్టుకున్న అంచనాలు నమ్మకాన్ని ఈ చిత్రం రీచ్ అయ్యి భారీ రెస్పాన్స్ ని తెలుగు రాష్ట్రాలు సహా యూఎస్ మార్కెట్ లో కూడా ఈ చిత్రం అందుకుంది. అంతే కాకుండా పైడ్ ప్రీమియర్స్ లో అయితే హను మాన్ ఆల్ టైం ఇండియన్ రికార్డు కూడా సెట్ చేయగా లేటెస్ట్ గా నైజాం వసూళ్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.
నైజాం లో హను మాన్ చిత్రం చాలా లిమిటెడ్ గానే రిలీజ్ అయ్యింది. మొత్తం 741 షోస్ ప్రీమియర్స్ తో కలిపి రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మొత్తం మొదటి రోజుకి గాను హను మాన్ చిత్రం ఏకంగా 3 కోట్లకి పైగా షేర్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది. దీనితో ఇంత లిమిటెడ్ గా రిలీజ్ అయినప్పటికీ కూడా ఈ చిత్రం ఈ రేంజ్ పెర్ఫామెన్స్ కనబరచడం విశేషం. ఇక ఈ చిత్రానికి గౌర హరీష్ సంగీతం అందించగా నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.