నార్త్ లో డే 2 అదరగొట్టిన “హను మాన్”

నార్త్ లో డే 2 అదరగొట్టిన “హను మాన్”

Published on Jan 14, 2024 11:00 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హీరో మూవీ హను మాన్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం నార్త్ లో కూడా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. మొదటి రోజు 2 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, రెండో రోజు భారీ జంప్ చేసి 4.05 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. దీంతో ఈ సినిమా 6.20 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఆదివారం రోజు వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం నేటితో 10 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టనుంది.

ఈ చిత్రం ఇప్పటికే చాలా ప్రాంతాల్లో హౌజ్ ఫుల్ షో లతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు