అక్కడ “గుంటూరు కారం” ను బీట్ చేసిన “హను మాన్”

అక్కడ “గుంటూరు కారం” ను బీట్ చేసిన “హను మాన్”

Published on Jan 15, 2024 7:05 AM IST


హను మాన్ మిగతా విడుదలలన్నింటికీ గట్టి పోటీనిస్తోంది. ఈ సూపర్‌హీరో చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. హను మాన్ ఇప్పుడు USA ప్రాంతంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాని బీట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. తాజా సమాచారం ప్రకారం హనుమాన్ దాదాపు 2.2 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, గుంటూరు కారం ప్రస్తుతం USA బాక్సాఫీస్ వద్ద 2.16 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టడం జరిగింది.

గుంటూరు కారం మాత్రమే కాదు, హను మాన్ USA లో భరత్ అనే నేను (3.42 మిలియన్ డాలర్లు), రంగస్థలం (3.51 మిలియన్ డాలర్లు), అల వైకుంఠపురంలో(3.61 మిలియన్ డాలర్లు) కలెక్షన్లను అధిగమించే దిశగా దూసుకుపోతోంది. ఫైనల్ రన్‌లో హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లకు పైగా వసూలు చేసినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ మరియు అమృత అయ్యర్ కూడా ప్రముఖ పాత్రలు పోషించారు. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. గౌర హరి స్వరాలు సమకూర్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు