శర్వానంద్ ‘ఒకేఒక జీవితం’ పై సీతారామం డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ …!

Published on Sep 8, 2022 7:15 pm IST

శర్వానంద్ హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ ఒకేఒక జీవితం. టైం ట్రావెల్ కథగా యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ అంశాలతో యువ దర్శకుడు శ్రీ కార్తీక్ తెరకెక్కించిన ఈ మూవీకి సుజిత్ సారంగ్ ఫోటోగ్రఫి అందించగా జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించారు. అమల అక్కినేని కీలక రోల్ చేసిన ఈ మూవీలో నాజర్, ఆలీ, మధునందన్ తదితరులు ఇతర పాత్రలు చేసారు.

ప్రారంభం నాటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్, టీజర్ అందరినీ ఆకట్టుకోగా నిన్న ఈ మూవీ యొక్క స్పెషల్ ప్రివ్యూ ని కొందరు సినీ ప్రముఖులకి వేసి చూపించడం జరిగింది. కాగా అది వీక్షించిన నాగార్జున, అఖిల్ వంటి వారు మూవీ ఎంతో అద్భుతంగా ఉందని ప్రశంసించగా, కొద్దిసేపటి క్రితం ఇటీవల సీతారామం మూవీతో ఆడియన్స్ హృదయాలు గెలుచుకున్న హను రాఘవపూడి తన స్పందనని సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలియచేసారు. ఒకేఒక జీవితం స్పెషల్ ప్రివ్యూ చూసాను, నిజంగా ఎంతో అద్భుతంగా ఉంది.

దర్శకుడు శ్రీకార్తిక్ ప్రతి ఫ్రేమ్ ని సూపర్ గా తీశారు, హీరో శర్వానంద్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్, అమల గారు ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారని అన్నారు. ఇటువంటి కథలకు సౌండ్ డిజైన్ ముఖ్యం అని, అది ఈ సినిమాకి సూపర్ గా కుదిరిందని, సౌండ్ మిక్సింగ్ చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. స్టోరీ ఆద్యంతం తన మనసుని ఎంతో కదిలించిందని, తప్పకుండా రేపు రిలీజ్ తరువాత ఆడియన్స్ కూడా మూవీ చూసి ఎంజాయ్ చేస్తారయని ఆయన తన పోస్ట్ లో తెలిపారు. కాగా హను పోస్ట్ కి రిప్లై ఇచ్చిన హీరో శర్వానంద్, మీ నుండి వచ్చిన ఈ ప్రత్యేక ప్రశంసలు నిజంగా ఎంతో ఆనందాన్నిచ్చాయన్నారు. మరి రేపు విడుదల కానున్న ఈ మూవీ ఎంత మేర విజయం అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :