లేటెస్ట్ గా బాలీవుడ్ సినిమా దగ్గర విడుదలకి వచ్చి ఒక సంచలన విజయాన్ని నమోదు చేసిన సినిమానే ‘హనుమాన్ అంశ్’. దర్శకుడు విశాల్ చతుర్వేది తెరకెక్కించిన ఈ డివోషనల్ డ్రామా కేవలం 44 షోస్ నుంచి ఇప్పుడు ఏకంగా 5 వేల 400 షోస్ కి పైగా సంఖ్యకు చేరుకుని సంచలనం సెట్ చేసింది.
అయితే ఈ సినిమా మొన్న సోమవారం వసూళ్ల కంటే మంగళవారం వసూళ్లు ఎక్కువ నమోదు కావడం విశేషం. ఇక ఈ వసూళ్లతో ‘హనుమాన్ అంశ్’ 135 కోట్లకి పైగా నెట్ వసూళ్ల మార్క్ అందుకొని సంచలన రన్ తో ఇప్పట్లో ఆగేలా లేదని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా ఖచ్చితంగా 200 కోట్ల మార్క్ ని సునాయాసంగా అందుకుంటుంది అని బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఈ సినిమాకి అంతకంతకూ ఆదరణ పెరుగుతుంది తప్పితే తగ్గే సూచనలు కనపడడం లేదు. సో నెక్స్ట్ టార్గెట్ 200 కోట్లు గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఈ వారం ముగింపు తోనే ఈ మార్క్ అందుకుంటుందో లేదో చూడాలి.
