“హనుమాన్” నుండి ఫస్ట్ సింగిల్ త్వరలో!

Published on Mar 5, 2023 7:00 pm IST

హనుమాన్ యొక్క టీజర్ దాని అత్యున్నత విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ అందుబాటులో ఉన్న వనరుల నుండి అవుట్‌పుట్‌ని పొందిన విధానానికి అసాధారణమైన స్పందన లభించింది. జాంబీ రెడ్డి వంటి హిట్‌ని అందించిన నటుడు – దర్శక ద్వయం తమ మొదటి పాన్ ఇండియన్ చిత్రం కోసం మళ్లీ జతకట్టారు. సినిమాలోని ఫస్ట్ సింగిల్ పై తాజాగా అప్డేట్ ఇచ్చాడు.

హనుమాన్ ఫస్ట్ సింగిల్ వస్తుంది అంటూ సరికొత్త పోస్ట్ చేయడం జరిగింది. సినిమా విడుదల తేదీని సూచించే టీ షర్టును ధరించాడు డైరెక్టర్. మే 12, 2023 ఈ మూవీ వరల్డ్ వైడ్ గా భారీగా థియేటర్ల లో విడుదల కాబోతుంది. ప్రైమ్‌ షో ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన కోలీవుడ్ బ్యూటీ అమృత అయ్యర్ కథానాయిక గా నటించింది. వరలక్ష్మి శరత్‌ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :