ఈ వినాయక చవితి నుండి “హనుమాన్” ప్రమోషన్స్!

Published on Sep 13, 2023 12:03 pm IST

టాలీవుడ్ యంగ్ నటుడు తేజ సజ్జ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్ హీరో ఫిల్మ్ హనుమాన్. ఈ చిత్రం ను వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ ను ఈ వినాయక చవితి పండుగ నుండి షురూ చేయనున్నారు.

ఇదే విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదిక గా వెల్లడించారు. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :